VKB: తాండూర్లోని ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 850 మంది విద్యార్థులతో నిర్వహించిన క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. అండర్-14,16 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. అండర్-14 విభాగంలో ‘విశ్వవేద హైస్కూల్’ విద్యార్థి క్రిత్విక్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచి బహుమతి అందుకున్నాడు.