NLG: కోదాడ పట్టణంలోని నయా నగర్, శ్రీమన్నారాయణ కాలనీల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో కోదాడ టౌన్స్ పోలీసులు ఆ గృహాలపై దాడులు చేశారు. నయానగర్లో ఇద్దరు మహిళ వ్యభిచార నిర్వాహకులు, ఒక విటుడు, శ్రీమన్నారాయణ కాలనీలో ఇద్దరు మహిళలు, ఒక విటుడు లను అదుపులోకి తీసుకున్నట్లు కోదాడ సీఐ రాము సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.