NGKL: పెద్దకొత్తపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాముల సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో పామును గుర్తించిన సిబ్బంది కర్రలతో కొట్టి చంపారు. ప్రాణాలను రక్షించే మాకు రక్షణ లేకుండా పోయిందని ఫార్మసిస్ట్ సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.