SRD: నారాయాణఖేడ్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో గ్రామ పంచాయితీ కార్మికులకు ప్రమాద భీమా కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో DLPOకు వినతి పత్రం అందజేశారు. డివిజన్ కార్యదర్శి రమేశ్ మాట్లాడుతూ.. జీపీ కార్మికులందరికీ గ్రామ పంచాయితీ నుంచి ప్రమాద భీమా కట్టించాలన్నారు. వారికి అనుకోకుండా చాల ప్రమాదాలు జరుగుతున్నాయని, వారి కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలన్నారు.