MDK: దసరా సెలవుల్లో ప్రవేట్ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో రాధా కిషన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21 నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు అన్ని పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించినట్లు చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా తరగతులు నిర్వహిస్తే నేరుగా ఎంఈఓలకు, తనకు గాని ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.