NZB: రెంజల్ మండలం వీరన్నగుట్ట నూతన గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన ఎత్తారి మాధవి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబీన్ ఖాన్, సీనియర్ నాయకులు ఉన్నారు.