ఆదిలాబాద్: ఇచ్చోడ మండలంలోని దుర్భపేట్ గ్రామానికి చెందిన కల్లే శేఖర్ గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఆత్రం సుగుణ వారి ఇంటికి వెళ్లి శేఖర్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరితో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.