KMM: ఖమ్మం రూరల్ మండలం వెంకటాయపాలెం గ్రామంలో ఉన్న చేతిపంపు నిరుపయోగంగా మారిందని గ్రామ ప్రజలు తెలిపారు. ఎప్పటినుంచో ఇక్కడ ఉన్న చేతి పంపును మరమ్మత్తులు చేయించడం లేదన్నారు. వేసవి కాలంలో త్రాగునీటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, అధికారులు స్పందించి మంచినీటి చేతిపంపుకు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.