HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలో, శ్రీ శివాలయం ప్రాంగణములో గల శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో, అక్టోబర్ 29వ తేదీ 2025 బుధవారం రోజు ఉదయం, అష్టమి సందర్భంగా శ్రీ కాలభైరవ స్వామి వారికి ప్రత్యేక అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారిని నూతన శ్వేత వస్త్రంతో, పూలమాలలతో, నుదురుపై చందనంతో, కుంకుమ తిలకాలతో అలంకరించారు. బూడిద గుమ్మడికాయతో దీపారాధన చేశారు.