KMR: రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కలిపించాలని గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. బీంగల్-కామారెడ్డి ప్రధాన రహదారిపై మద్దికుంట మర్రివద్ద డ్వాక్రా సంఘాలు, కాలేజీ విద్యార్థులు నిరసన తెలిపారు. ఎన్నిసార్లు ఆర్టీసీ అధికారులకు విన్నపం చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. పోలీస్లు వచ్చి నచ్చజెప్పడంతో విరమించారు.