GDWL: అయిజ మండలం ఈడిగోనిపల్లి మీదుగా పంచముఖి ఆలయానికి వెళ్లే రోడ్డు మరమ్మతులు పూర్తి చేయించాలని గ్రామస్థులు తాయప్ప, గోవర్ధన్ కోరారు. సోమవారం గద్వాల కలెక్టర్ సంతోష్‌కు కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఏడేళ్ల కిందట రోడ్డు నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్ నేటికీ పనులు చేయకపోవడంతో ఆ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.