HYD: కొందరు మీసేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం అనే పేరుతో నకిలీ ప్రకటనను సృష్టించారని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి వెల్లడించారు. హైదరాబాద్ కలెక్టరేట్ నుంచి కొత్తగా మీసేవ కేంద్రాల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదని పేర్కొన్నారు. అక్రమార్కులు కొత్త మీసేవ కేంద్రాల కేటాయింపు కోసం డిపాజిట్లు కూడా సేకరిస్తున్నట్లు తెలియజేశారు.