HYD: నగర శివారు జీడిమెట్ల పరిధి చింతల్లో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. ఆగ్రోస్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఫుట్ పాత్పై ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే PSకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్రగాయాలతో ఉన్న మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. హత్యాచారం చేసి ఫుట్ పాత్పై పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.