BDK: రేపు (సోమవారం) జిల్లా కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ ఆదివారం తెలిపారు. ప్రజలు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది.