SRD: కంగ్టి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ MRO జుబేర్ బదిలీ అయ్యారు. అయితే గురువారం స్థానిక కార్యాలయంలో MRO భాస్కర్, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీ ఓ.సుభాష్, కార్యాలయం అధికారులు, సిబ్బంది కలిసి ఆత్మీయ సన్మానం చేశారు. గత కొన్నేళ్ల నుండి బాధ్యతతో విధులు నిర్వహించిన డిప్యూటీ MRO జుబేర్ సేవలను అధికారులు కొనియాడారు. అనంతరం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.