MDK: రామయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో కోతుల దండు అధికంగా తయారైంది. ఉదయం సుమారు 100 నుంచి 200 కోతులు విచ్చలవిడిగా గ్రామంలో సంచరిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యాన్ని చిందరవందర చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఇండ్లలోకి దూరి నిత్యవసర సరుకులు తీసుకువెళ్తున్నాయన్నారు. సంబంధిత అధికారులు కోతులను బంధించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.