MLG: ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో సోమవారం మంత్రి సీతక్క సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కురుసం సంధ్యారాణి-మహేష్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్థులను కోరారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తున్నామని, మరింత చేస్తామని హామీ ఇచ్చారు.