HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు హక్కు పొందేందుకు నేడు చివరి అవకాశం అని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. నేడు సాయంత్రం వరకు అందిన దరఖాస్తులనే అధికారులు పరిశీలించి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు అవకాశం కల్పిస్తారన్నారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.