KNR: బతుకమ్మ సంబరాలు షురూ కానున్నాయి. పూలతో దేవుళ్లను పూజించే సాంప్రదాయానికి భిన్నంగా తెలంగాణ ఆడపడుచులు పూలనే పూజించే పండుగ బతుకమ్మ. బతుకమ్మను పేర్చడానికి తంగేడు, గుమ్మడి, సీతమ్మ, గోరింట, కట్ల, బంతి, చామంతి, గునుగు పువ్వులను ఎక్కువగా వాడతారు. కొన్ని పువ్వులకు రంగులద్ది బతుకమ్మను ముస్తాబు చేస్తారు. ఈ సందర్భంగా మహిళలు గౌరమ్మను కొలుస్తారు.