SRPT: ధాన్యం సేకరణ పక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తెజస్ నంద్ లాల్ పవార్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. సూర్యాపేట మండలంలోని పిల్లలమర్రి, బాలెంలా, రామన్నగూడెం,పీఏసీఎస్, ఐకేపీ నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు, రైతులు తరలించిన ధాన్యం నిల్వలను, వాటి నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు.