JN: జాఫర్‌గఢ్ మండలం తిమ్మంపేటలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు ఇవాళ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి కోసం బీజేపీ బలపరిచిన వార్డు మెంబర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్, BJYM నాయకులు శరత్ కుమార్ బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.