MBNR: పాలమూరు ఎడారిగా మారే ప్రమాదమున్న కర్ణాటక జల దోపిడిని అడ్డుకుంటామని మాజీమంత్రి లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. MBNRలో ఆదివారం బీఆర్ఎస్ బృందంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా నదిపై ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఉద్యమం చేపడతామన్నారు.