ASF: కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేస్తున్నట్లు గమనించి, చాకచక్యంగా పట్టుకున్న ID పార్టీ కానిస్టేబుల్ రాజును జిల్లా SP శ్రీనివాసరావు శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రశంసా పత్రం అందజేశారు. ప్రతి ఒక్కరు రాజును ఆదర్శంగా తీసుకొని శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు.