HYD: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద ఆడబిడ్డల పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని యాకుతుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ అన్నారు. గురువారం తలాబ్ కట్టలో లబ్ధిదారులకు మంజూరు అయిన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మొత్తం 55 మందికి చెక్కులు అందజేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఐఎం కార్పొరేటర్లు, కార్యకర్తలు,అధికారులు పాల్గొన్నారు.