MDK: పాపన్నపేట మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవాని మాతకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం వేకువజామున ఆలయ అర్చకులు అమ్మవారికి మంజీరా నదీజలాలతో అభిషేకం చేసి పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి, సహస్రనామార్చన, కుంకుమార్చన పూజలు నిర్వహించి మంగళహారతి ఇచ్చారు.