యాదాద్రి: ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా మంగళవారం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న క్రీడలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుతాయని అన్నారు.