HNK: జిల్లా కేంద్రంలోని ఏకశిల పార్కులో నేడు దళిత బహుజన ఫెడరేషన్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మహనీయుల జయంతి మాసోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. దళిత బహుజన సాధికారత జాతీయ కార్యదర్శి శంకరన్న కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.