WGL: వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో లైసెన్స్ లేకుండా వాహనం నడిపి పట్టుబడ్డ ఒకరికి శుక్రవారం వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ వెంకటేశం రూ. 2,000 జరిమాన విధించినారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 24 మందికి రూ.26,000 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ కె.రామకృష్ణ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.