JN: పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో శుక్రవారం పోతన సాహిత్య కళావేదిక ఆధ్వర్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కళా ప్రపూర్ణ బోయి భీమన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోతన సాహిత్య కళావేదిక అధ్యక్ష కార్యదర్శులు మాన్యపు భుజేందర్, దేవసాని ఉపేందర్, బమ్మెర దేవస్థాన మాజీ ఛైర్మన్ పెందోట వెంకటాచారి, మాడరాజు యాకయ్యలు పాల్గొని ప్రసంగించారు.