WGL: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12వ తేదీ లోపు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రాజకీయ పార్టీలకు తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.