HYD: ఉస్మానియా యూనివర్సిటీ పరిధి అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును ఈ నెల14వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. రూ.500 అపరాధ రుసుముతో 18వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు.