కెనడా ప్రభుత్వం ‘ఆస్ట్రేలియా టుడే’ మీడియా సంస్థపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆ సంస్థ మేనేజింగ్ ఎడిటర్ జితార్థ్ జై భరద్వాజ్ స్పందించారు. అవరోధాలకు అధైర్యపడకుండా.. ముఖ్యమైన వార్తలు, గొంతుకలను ప్రజలకు చేరవేయాలనేది తమ లక్ష్యమని, దానిపైన తాము స్థిరంగా ఉన్నామని చెప్పారు. తమకు ఉన్న మద్దతు స్వేచ్ఛాయుత మీడియా ప్రాముఖ్యతను చెబుతుందని, కచ్చితత్వంతో కూడిన వార్తలను అందించే హక్కు కోసం ప్రయత్నిస్తు ఉంటామని చెప్పారు.