అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. మునుపటి తప్పులను సమీక్షించుకునేందుకు అమెరికాకు ఇదో అవకాశమని ఇరాన్ విదేశాంగశాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయి పేర్కొన్నారు. గతంలో అమెరికా ప్రభుత్వ విధానాలతో తమకు చాలా చేదు అనుభవాలు ఉన్నాయని తెలిపారు. ‘అమెరికా అధ్యక్ష ఎన్నికలతో మాకు ప్రత్యేకంగా ఒరిగేదేమీ ఉండదు. అధ్యక్షులు మారినంత మాత్రాన విధానాలు పెద్దగా మారవు’ అని వ్యాఖ్యానించారు.