ట్రంప్ విజయంతో తనకు అమెరికాలో భవిష్యత్తు లేదని ఎలాన్ మస్క్ కుమార్తె జెన్నీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు థ్రెడ్స్‌లో పోస్ట్ చేసింది. అలాగే, లింగ మార్పిడిపై కఠిన నిబంధనలు రానున్నాయని తెలిపింది. జెన్నీ అమెరికాను వీడుతుందన్న పోస్టు గురించి తెలుసుకున్న మస్క్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘నా కుమారుడిని ఓక్ మైండ్‌సెట్ చంపేసింది’ అని పునరుద్ఘాటించారు. కాగా, 2022లో జెన్నీ లింగమార్పిడి చేయించుకున్న విషయం తెలిసిందే.