ADB: భోరజ్ మండలంలోని పౌజ్పూర్ గ్రామంలో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. గత మూడు నెలలుగా డ్రైనేజీలు పూడిక తీయకపోవడంతో, రోడ్లమీద నుంచి మురుగునీరు ప్రవహిస్తుందని గ్రామస్తులు తెలిపారు. పలుసార్లు అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని వాపోయారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ పూడిక తీయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.