SDPT: సిద్దిపేటలో ఈనెల 26న తెలంగాణ ఉద్యమకారుల వేదిక సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో ఆత్మీయ సభను నిర్వహించనున్నట్లు ఉద్యమకారుల జేఏసీ నాయకులు తెలిపారు. సోమవారం సాయంత్రం సిద్దిపేటలో సమావేశమైన మాట్లాడుతూ.. ఈనెల 26న సాయంత్రం 5 గంటలకు సిద్దిపేట టీఎన్జీవో భవన్లో ఆత్మీయ సభను నిర్వహిస్తున్నట్లు, ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరవుతున్నట్లు తెలిపారు.