NLG: గంజాయి సేవిస్తున్న యువకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు విజయపురి టౌన్ ఎస్సై ముత్తయ్య శనివారం తెలిపారు. హిల్ కాలనీ ఆఫీసర్ క్లబ్ పరిసరాల్లో గంజాయి సేవిస్తున్న ఖమ్మం జిల్లా మేడిపల్లి గ్రామం చెందిన బొడ్డు విక్రమ్ (21)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడు హిల్ కాలనీలోని నాట్కో ఫార్మసీ కంపెనీలో పనికి వచ్చి ఇక్కడే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.