NZB: కోడిపందెలు, పేకాట, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సాయి చైతన్య ఆదివారం వెల్లడించారు. పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపంలో పేకాట, కోడిపందెలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.