JGL: జగిత్యాల పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రికార్డులు, కేసు డైరీలు, రిజిష్టర్లు పరిశీలించి సిబ్బంది పనితీరును అంచనా వేశారు. సీఐ కరుణాకర్, ఎస్సైలు కుమారస్వామి, మల్లేష్, రవి కిరణ్, సుప్రియా, ఇతర సిబ్బంది ఈ తనిఖీలో పాల్గొన్నారు.