NGKL: నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లిలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద ఏర్పాటు చేసిన నర్సరీని ఈరోజు డీఆర్డివో చిన్న ఓబులేష్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరానికి జిల్లా టార్గెట్ ప్రకారం ప్రతి గ్రామంలో కొత్త నర్సరీలను ఏర్పాటు చేయాలని సూచించారు. నర్సరీకి అవసరమైన ఎర్ర మట్టి, ఎరువు, ఇసుకతో కూడిన మిశ్రమాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.