WNP: ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. జిల్లాలో 12 ఇసుక రీచ్లు ఉన్నాయని అన్నారు. జిల్లాలో ఇసుక అవసరం ఉన్నవారు ‘మన ఇసుక వాహనం’ ద్వారానే తీసుకోవాలని దళారులను ఆశ్రయించొద్దని సూచించారు. ఇసుకకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఐడీఓసీలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం 08545-233525కు కాల్ చేసి తెలపాలని అన్నారు.