WGL: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో సోమవారం ఏఐటీయూసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవం అక్టోబర్ 31న పురస్కరించుకొని కార్మికులు ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ వేడుకలకు అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు.