SDPT: హుస్నాబాద్ మండలం బంజెరుపల్లె గ్రామ సర్పంచ్ అభ్యర్థి బాణాల సబితా నందా రెడ్డి సొంత ఖర్చులు పెట్టి గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో విస్తృతంగా పర్యటించి ఓటర్లను కలిసి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. గ్రామంలో సమస్యలపై పూర్తిగా దృష్టి సారించి అభివృద్ధికి సహకరిస్తానని ఆమె తెలిపారు.