NLG: చందంపేట మండలం కాట్రావత్ తండా గ్రామపంచాయతీకి జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన కాట్రావత్ హరిలాల్ విజయం సాధించారు. తన ప్రత్యర్థి, కాంగ్రెస్ బలపరిచిన ముడావత్ క్రాంతి కుమార్‌పై 173 ఓట్ల మెజారిటీతో హరిలాల్ విజయం సాధించారు. హరిలాల్ గెలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు.