MNCL: మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న నిరాహార దీక్ష కొనసాగుతోంది. మంగళవారం దీక్షా శిబిరాన్ని జాతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఓయూ జేఏసీ రాష్ట్ర నాయకులు చేరాల వంశీ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.