KMM: సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు దేవదాసు ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రం ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేవదాసు మృతి పట్ల పలువురు సీపీఎం నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు.