SRPT: హుజూర్ నగర్ మున్సిపల్ కేంద్రంలో రైతు భరోసా ఎగవేతపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని, రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేంతవరకు అన్నదాతల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు.