MNCL: జన్నారం పట్టణంలోని పలు కాలనీలలో వైరల్ జ్వరాలు ప్రబలడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మండలంలో 15 రోజులుగా భారీ వర్షాలు పడ్డాయి. దీంతో జన్నారం పట్టణంలోని ప్రజలు వివిధ వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వైద్య సిబ్బంది సహాయంతో ఇంటింటి ఫీవర్ సర్వే చేయించి ఉచితంగా మందులను పంపిణీ చేయాలని ఆయా కాలనీల ప్రజలు కోరారు.