AP: ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో నిందితుడు కుక్కల విద్యాసాగర్ రావును తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు వారం రోజుల పాటు కస్టడీ కావాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. కాగా ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన విద్యాసాగర్ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.