TG: దసరా పండుగను ఊరువాడా ఘనంగా జరుపుకుంటారు. అయితే ప్రజల్లో పండుగ జోష్ మరింత నింపేందుకు మంచి ఆఫర్లు తెరపైకి వస్తున్నాయి. మంచిర్యాల జిల్లా బోయపల్లి గ్రామస్తులు ఓ ఆఫర్ ప్రకటించారు. కేవలం రూ.100 కూపన్‌తో ఆకర్షణీయమైన బహుమతులు అందిస్తామని తెలిపారు. లక్కీ డ్రాలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా గొర్రె పొట్టేలు, రెండవ బహుమతిగా మేకపోతు, మిగిలిన బహుమతులుగా బ్రాండెడ్ మందు బాటిళ్లు, నాటుకోడి పుంజు, నాటుకోడి పెట్టెను అందిస్తారట.